My Observations Being a Human Resources Development Professional are converted into words and posted here in order to make the readers to introspect and better their perceptions.
Sunday, July 1, 2012
తెలుగు గజల్..
తెలుగు గజల్..
మత్తులో గమ్మతుగా ఊగాలని లేదు తొత్తులా బానిసనై బతకాలని లేదు
కీర్తి కాంత కాంచనాలే జగతిని నడిపిస్తుంటే ప్రతి బంధాన్ని పైసా తో కొలవాలని లేదు
అనుమతి నీవు ఇవ్వనిదే అజమాయిషీ నీపై సాధ్యమా అధికారం ముందు ఆత్మగౌరవం అమ్మాలని లేదు
ఒడ్డుచేరినాక తెప్పతెగలేయడం షరా మామూలే ఓనమాలని నేర్పిన గురువుని మరవాలని లేదు
అయిదు చుక్కల పూటకూళ్ళ సత్రాల ఆడంబరాలెన్నున్నా అమ్మ చేతి గోరుముద్దతో సరి పోల్చాలని లెదు
నీవొప్పుకోనిదే ఓటమి ఓటమి ఎలా అవుతుంది పడిన చోటే బావురుమంటూ నిలవాలని లేదు
భూమి బంగారాలు కాదు , నా అన్నవాళ్ళే నీ అసలైన ఆస్తి
అహం తలకిక్కించుకొని అందరికి దూరం కావాలని లేదు
ఎందుకు ఉదయ్ ఈ తత్వాలు ఎవడు వినాలని స్పందించక ఆగిన హృదయాలను వదిలేయాలని లేదు.
nice...baagundandi.
ReplyDelete@sri
very inspiring
ReplyDeleteAdbutham
ReplyDelete