Sunday, June 24, 2012

పెంచానురా కన్నా!


 ఈ చేతులలోనే నిన్ను పెంచానురా కన్నా!
  నీ  చేతల లోనే నన్ను కాంచానురా కన్నా!


నే చేరలేని గమ్యాలు నిత్యం వేధిస్తుంటే
నా ఆశలుగా మధించి నీపై ఉంచానురా కన్నా!


తడి అందని మడులెన్నో బంజరులౌతుంటే
పరిధి లేని ప్రేమను సదా పంచానురా కన్నా!


నాకై నేను బతకడం నీ రాకతో సరి
ప్రతిక్షణం నీ భవితకై  వెచ్చించానురా కన్నా!


చిరుతిళ్ళకోసం మారాం ఆపడం నాతరమా
శబరినై ముందుగా నే ఎంచానురా కన్నా!

వివేకోదయం కలిగించేది చదువే కదా
ఏ దారిలో నడవాలో సదా ఆలోచించానురా కన్నా!
koodali.org, haaram, jalleda, telugu gazels, telugu poetry

Saturday, June 9, 2012

దాంపత్యం పరిఢవిల్లేనా

koodali.org, haara,. jalleda. telugu gazel 



ఈ జీవితం పరిపూర్ణమయ్యేనా..  నీ తోడే  లేకుంటే
నా వ్యక్తిత్వం సంపూర్ణమయ్యేనా..  నీ తోడ్పాటే  లేకుంటే


ఎన్ని సుడులు, ఎన్ని మునకలు...  ముంచెత్తే  అలలెన్నో
సంసారనావ  ఒడ్డు చేరేనా...  నీవనె  తెరచాపే లేకుంటే


మత్తునింపే మరులు ఎన్నో...  గుభాళించే అత్తరులెన్నో
పూలపాన్పు పల్లవించేనా...  జంటగా నీ సయ్యాటే  లేకుంటే

చేతికందిన లక్ష్యాలు..   విజయానికివే  సాక్ష్యాలు
అంతిమ గమ్యం సాధ్యమయ్యేనా..   నీతో ఆలోచనే లేకుంటే

కవ్వించే  పలకరింపులు.....  ఏమార్చే స్నేహమూర్తులు
తిన్నగా  నా బాట సాగేనా..  ఎర్రని నీ కనుచూపే లేకుంటే


చీకట్లను చీల్చిన ఉదయమా...  ఇక్కట్లను గెలిచిన ప్రణయమా..
దాంపత్యం పరిఢవిల్లేనా.  ....    నామదిలో నీ రూపే లేకుంటే