Sunday, March 18, 2012

అవాకులు, చెవాకులు




*
ప్రేమైనా, పగైనా
ఎదుటివారి స్పందన బట్టే
ఈ ఇంటి నుండి ఆ ఇంటికి
ఎటునుండి కొలిచినా దూరం ఒకటే

**

ఎవడో విమర్శిస్తున్నాడని
వెంటనే అదే స్థాయి లో రెచ్చిపోకు
జెలోసిల్ గాని ఈనో గాని
వెంటనే వాడి చేతిలో పెట్టు

***

మా ఊర్లో ప్రభుత్వ జాగాలు
తెగ డైటింగ్ చేస్తున్నాయి
భూబకాసురులకి
ఆకలెక్కువైంది మరి

****

గోడమీద పిల్లులు
సిగ్గుతో తలవంచుకుంటున్నాయి
రాష్ట్రంలో మరో కొత్త పార్టీ
అవతరించినప్పటినుండి

****

సంఘసేవ చేద్దామనే
సేవకులు ఎక్కువై పోతున్నారు
అన్నార్తుల, అనాథల పరిస్థితేమో గాని
ఫోటోగ్రాఫర్ లకు రెండు చేతులా పనే

****

తల్లిదండ్రులు దైవ సమానులట
ఆయన వేదిక మీద వీర ప్రసంగం
ఇంతలో అర్జంటుగా కబురు
ఓల్డేజ్ హోమ్ లో అతని తల్లి
వైద్యం అందక మరణించిందట