Sunday, June 24, 2012

పెంచానురా కన్నా!


 ఈ చేతులలోనే నిన్ను పెంచానురా కన్నా!
  నీ  చేతల లోనే నన్ను కాంచానురా కన్నా!


నే చేరలేని గమ్యాలు నిత్యం వేధిస్తుంటే
నా ఆశలుగా మధించి నీపై ఉంచానురా కన్నా!


తడి అందని మడులెన్నో బంజరులౌతుంటే
పరిధి లేని ప్రేమను సదా పంచానురా కన్నా!


నాకై నేను బతకడం నీ రాకతో సరి
ప్రతిక్షణం నీ భవితకై  వెచ్చించానురా కన్నా!


చిరుతిళ్ళకోసం మారాం ఆపడం నాతరమా
శబరినై ముందుగా నే ఎంచానురా కన్నా!

వివేకోదయం కలిగించేది చదువే కదా
ఏ దారిలో నడవాలో సదా ఆలోచించానురా కన్నా!
koodali.org, haaram, jalleda, telugu gazels, telugu poetry

1 comment: