Saturday, June 9, 2012

దాంపత్యం పరిఢవిల్లేనా

koodali.org, haara,. jalleda. telugu gazel 



ఈ జీవితం పరిపూర్ణమయ్యేనా..  నీ తోడే  లేకుంటే
నా వ్యక్తిత్వం సంపూర్ణమయ్యేనా..  నీ తోడ్పాటే  లేకుంటే


ఎన్ని సుడులు, ఎన్ని మునకలు...  ముంచెత్తే  అలలెన్నో
సంసారనావ  ఒడ్డు చేరేనా...  నీవనె  తెరచాపే లేకుంటే


మత్తునింపే మరులు ఎన్నో...  గుభాళించే అత్తరులెన్నో
పూలపాన్పు పల్లవించేనా...  జంటగా నీ సయ్యాటే  లేకుంటే

చేతికందిన లక్ష్యాలు..   విజయానికివే  సాక్ష్యాలు
అంతిమ గమ్యం సాధ్యమయ్యేనా..   నీతో ఆలోచనే లేకుంటే

కవ్వించే  పలకరింపులు.....  ఏమార్చే స్నేహమూర్తులు
తిన్నగా  నా బాట సాగేనా..  ఎర్రని నీ కనుచూపే లేకుంటే


చీకట్లను చీల్చిన ఉదయమా...  ఇక్కట్లను గెలిచిన ప్రణయమా..
దాంపత్యం పరిఢవిల్లేనా.  ....    నామదిలో నీ రూపే లేకుంటే

3 comments:

  1. బాగుంది మీ అన్యోన్యత.:-)

    ReplyDelete
  2. పద్మార్పిత గారు..
    ఇది మా గురించి కాదు... అందరి గురించి.... ప్రతి భర్త హృదిలో వ్యక్తపరచలేని భావాల రూపమే ఈ గజల్.... త్వరలో సి.డి లో విందురు గాని...

    ReplyDelete
  3. మీ అంటే ఇక్కడ ఎవరైతే అలా ఉంటారో వారికి అని నాభావం.
    Waiting for CD to hear.

    ReplyDelete