Friday, May 25, 2012

మరణమంటే.....

        
           మరణమంటే.....


శ్వాస గమనం ఆగడం         కాదు   మరణం
గుండె కదలిక  నిలవడం           కాదు మరణం    ॥ శ్వాస ॥


ఏ ఎండకు ఆ గొడుగు        ఎంత కాలమీ వేషాలు
నమ్మిన సిద్దాంతాలకు     నీళ్ళు వదలడమే  మరణం  ॥ శ్వాస ॥


గర్జించే సింహంలా       రొమ్ము విరుచుకు సాగాలి
పిరికితనంతో పేడివానిగా     మిగలడమే మరణం      ॥శ్వాస॥


వయసుమీరినాక పలికే      వైరాగ్యాలెందుకు భాయి
ఆశల  వలలో పడి          నీతి దిగజారడమే మరణం    ॥శ్వాస॥

కనిపెంచిన  తల్లిదండ్రుల రుణమీ జన్మలో తీరునా?
వ్యర్థమని వృద్ధాశ్రమాలలో వదిలివేయడమే మరణం   ॥శ్వాస॥


విశ్వాసం కోల్పోయిన వాడి      ఉనికి   ఉండేదెక్కడ
ఇచ్చిన మాటను  గాలికి       వదిలెయ్యడమే  మరణం   ॥శ్వాస॥


ఉదయపు తొలి ఝాములోనే    మధుశాలకు పయనాలా
వ్యసనాలకు బానిసలై     విలువ కోల్పోవడమే మరణం  ।శ్వాస॥

8 comments:

  1. చెప్పడానికి బాగుండి...ఆచరణలో కష్టమైంది కదండీ ;-)

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు.......అందుకే కదండీ నూటికి తొంభైఏడు శాతానికి పైగా జీవచ్చవాల్లా విలువల వలువలు లేకుండా దిగంబరంగా జీవించేస్తున్నారు.... కాస్త నిర్లజ్జగా మరికాస్త నిస్సహయంగా.........

      Delete
  2. సూపర్.. చాలా బాగా చెప్పారు.. ఉదయ్ గారు..

    ReplyDelete
    Replies
    1. సాయి గారు...ధన్యవాదాలు.....

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు మీ ఆనందానికి... మీ ఆశ్చర్యానికి.....మీ సందేహాలకు.... మొత్తానికి మీ ప్రతిస్పందనకు...

      Delete
  4. Replies
    1. చాలా బాగా చెప్పారు.

      Delete