Tuesday, May 22, 2012

శిఖరాన్ని నేను........

      
                                koodali.org, haaram,  శిఖరాన్ని నేను ( తెలుగు గజల్)

 జానా బెత్తెడు లెక్కలకు అందని   శిఖరాన్ని నేను
యువసైన్యాలను ఉరకలెత్తించే శంఖారావాన్ని నేను


అడ్డుగా ఓ గట్టు వేస్తే  ఇంకిపోయే చలమననుకున్నావా?
నింగిని నేలను ఒకటి చేసే  జల సునామీని నేను


ఉఫ్ మని ఊదేస్తే ఆరే దివ్వెననుకున్నావా?
భుగభుగమనే సెగలతో రగిలే జ్వాలాముఖిని నేను


విమర్శల ధాటికి వెనుతిరిగే భీరువుననుకున్నావా?
ఊరకుక్కల అరుపులకు చలించని ఐరావతాన్ని నేను


ఊపిరిపోతే  కనుమరగయ్యే స్మృతిననుకున్నావా?
ఆచంద్రతారార్కం  అందరి హృదిలో నిలిచే ఆదర్శం నేను


మాయామాటలతో మసిపూస్తే కనిపించని అద్దాననుకున్నావా?
చిమ్మ చీకట్లను చెల్లాచెదురుచేసే  'ఉదయ'కాంతిని నేను

12 comments:

  1. చాలా బాగుంది ఉదయ్ గారు.. మీ బ్లాగుఅంటే నాకు ఇష్టం...
    ఎంతో ఆత్మస్ధైర్యాన్ని ఇచ్చేలా ఉంటాయి మీ పోస్టులన్నీ... ధ్యాంక్యూ సో మచ్.....

    ReplyDelete
    Replies
    1. సాయి గారు ధన్యవాదాలు మీ అభినందనలకు

      Delete
  2. బాగుందండీ మీ కవిత...
    ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి, అభినందనలకు ధన్యవాదాలు..

      Delete
  3. very impressive lines in this wonderful ghazal brother! keep it up! expecting more n more from you !! All the best!

    ReplyDelete
  4. Wow, Great words.Self-respect with self-confidences made great and kept this at Everest. Hats-off you sir.

    ReplyDelete
  5. Excellent expressions! Clarity is beyond imagination! Good luck in all your endeavors Uday garu!

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete