My Observations Being a Human Resources Development Professional are converted into words and posted here in order to make the readers to introspect and better their perceptions.
Friday, February 1, 2013
మగతనమంటే
ఆడవారిని అర్థం చేసుకోలేనివాడు అమ్మతనం చవి చూడనివాడే అమ్మ లాలింపు పొందని వాడు అతివల ఔదార్యాన్ని, ఔన్నత్వాన్ని అర్థం చేసుకోలేడు అవగాహన పొందలేడు మగతనం అంటే కర్కశంగా కాఠిన్యంగా కరుణలేకుండా బండలాగ బ్రతకడం కాదు బయట పరిస్థితులబట్టి ఎలా వ్యవహరించాల్సి వచ్చినా లోన లోలోన అమ్మతత్వం అపురూపంగా దాచుకోవడమే పూలని నలిపినట్టు, వాసన చూసి వెదజల్లినట్టు వ్యవహరించడం మూర్ఖత్వం అమానుషత్వం శతశాతం శౌర్యం నీలో ఉందంటే సుమబాలల సున్నితత్వం ఆడవారి ఆత్మగౌరవం నిలపడం నీకు తెలుసన్నమాట తండ్రితో ఉన్నప్పుడెంత గోముగా, ధైర్యంగా మరికొంచెం పెంకిగా తల్లితో ఉన్నప్పుడు ఎంత విశ్వాసంగా, లాలనగా మరికొంచెం అతిచనువుగా ప్రతి స్త్రీ ఉంటుందో ఆ భావనలన్నీ నీవు కల్పించగలిగావంటే నీ ఆదరణలో , నీ ఆప్యాయతలో వాటిని మరువగలుగుతుందో నూటికి నూరుపాళ్ళు నీవు మగవానిగా విజయం సాధించినట్టే చెంతన నీవున్నావంటే గజ గజా వణకడం కాదు ఎక్కడో పారవేసుకున్న పసితనం మరలా ఆమెలో ప్రవేశించాలి ఆనందం చిందులు వేస్తూ, కబుర్లతో కాలహరణం కావించాలి ప్రక్కన నీవున్నావంటే ప్రపంచాన్ని జయించినంత పులకరింత నరనరానా నిండాలి నూతనోత్సాహం కలగాలి కొత్త బంగారు లోకం కనులముందు నిలవాలి కలకాలం సాగాలనే కోరికలతో నడవాలి
No comments:
Post a Comment