Saturday, October 20, 2012

అర్డినరీ............ ఎక్సట్రార్డినరీ...


ఆడవాళ్ళని ఇంతవరకు ఏ మగవాడు
సరిగా అర్థం చేసుకోలేదు.
పాపం ప్రతీ స్త్రీ ఎంతో బాధతో ,
ఆవేదనతో , ఆర్ద్రతతో , కొంచెం కసి తో
మరికాస్త అక్కసుతో స్వాంతనకోసం పలికే మాటలు.
ఒక్కో అక్షరం ఒక్కో బాషలో ఉన్న వాక్యాల్ని
ఎన్ని బాషలు తెలిసినా ఎవడు అర్థం చేసుకోగలడు
ఒక అడుగు ఉత్తరం వైపు మరో అడుగు దక్షిణం వైపు
వేస్తూ సాగే గమనం ఎటువైపంటే
ఎవడి బుర్రకి ఎక్కుతుంది
రెండు అడుగులు ముందుకి
నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళే
ప్రయాణ వేగాన్ని ఎవడు మాత్రం అందుకోగలడు

ముందు నీకు నీవు అర్థం అయ్యావా
ఇతరులు అర్థం చేసుకోడానికి అన్నామా
అపర కాళికల్లా విరుచుకు పడతారు
చందమామ తో పోల్చినా, సాగే గోదావరి తో పోల్చినా
కవిత్వపు పైత్యం కాదు నాయనా
అవి బూటకాలని ఏ బాటకో ఆ పయనాలని
వాళ్ళకు మాత్రమా తెలియదా
ఆర్డినరీ యో ఎక్సట్రార్డినరో ఏది నిజమో
వారికి మాత్రం తెలియదా
నిజంగా ఎక్సట్రార్డినరి అయితే
ఏ మగవాడి ప్రమాణ పత్రాల కోసం
గొప్పల మెప్పులకోసమో తిప్పలెందుకో ?
ఆర్డినరీ అన్న సంగతీ బాగా తెలుసు కాబట్టే
పై పై మేకప్పుల కోసం , జిగేళ్ మనిపించే
బిల్లు చూసి కళ్ళు బైర్లు కనిపించే దుస్తులకోసం
ఇంత హైరానాలన్నామా అంతే
పురుషాధిక్యత నశించాలంటూ తిట్ల దండకాలు
ఆర్డినరీ అని బాగా తెలుసు కాబట్టే
పొగడ్తలకోసం, ప్రశంసల కోసం
ఎక్కడ హచ్ డాగ్ వెంటపడదా అంటూ
ముసి ముసి నవ్వులు, ఓరకంటి చూపులు
అన్నన్నా పూరీ జగనన్నా ఎంత పని చేసావన్నా
అబద్దపు లోకాల్లో ఎక్సట్రార్డినరీలమంటూ
ఆశగా ఊరేగుతున్న అతివల టైర్ల గాలి
ఇలా తీసివేసావేమన్నా ??????
అమ్మతనం తనువంతా కప్పుకున్న ఆడదే ఎక్సట్రార్డినరీ
ఆత్మ విశ్వాసం అణువణువునా నింపుకున్న యువతే ఎక్సట్రార్డినరీ
లేనిపోని ఎక్సట్రాలు చేసేదంతా ఆర్డినరీ యే..
..

1 comment:

  1. ఆడవాళ్ళగురించి అన్ని చెప్పిన మీరు మగవాళ్ళగురించి చెప్పడం మరిచారు:-)

    ReplyDelete