Thursday, February 2, 2012

టైం మేనేజ్ మెంట్



ఏమిటీ? ఏ పనికి ఉన్న సమయం చాలడం లేదా?
సమయాన్ని ఎలా నియంత్రించాలో తెలియడం లేదా?
సమయాన్ని నియంత్రించడం నీకు కాదు కదా
నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకు కూడా వీలు పడదు
ఉన్న సమయాన్ని వివేకంతో
ఉపయోగించుకోవడమే యోగ్యుల లక్షణం
రోజులో ఎంత సమయం వృథా గా పోతుందో
ఆత్మసాక్షిగా అవలోకనం చేసుకో
అర్థం లేని కబుర్ల తో, పనికి మాలిన బాతాఖానీలతో
ఫేస్ బుక్, చాటింగ్, బ్రౌజింగ్ లతో
ఉపయోగం లేని సీరియళ్ళ వీక్షణంలో
ఎంత సమయం నీకు తెలీకుండా హరించుకుపోతుందో
అంచనా వేసుకో, అవసరం లేని వాటిని వెంటనే వదిలించుకో
ప్రతీ దినం వేకువనే మెలుకవ వచ్చినా సరే
బద్ధకం స్వారీ చేయడం వలన
ముసుగు తీయకుండా ఊహల్లో ఊరేగడం ఆపాలి
ఉరకెత్తే కెరటం లా ప్రక్క మీదనుండి లేవాలి
ఆ రోజు చేయాల్సిన పనులేమిటో ఆ సమయంలోనే
ఓ జాబితా మనసులో బలంగా ముద్రించుకో
మరలా నిద్రకు ఉపక్రమించేముందు ఎంతవరకు
పూర్తయ్యావో ఇంకా ఏమి చేయాల్సి ఉందో ఓ క్షణం ఆలోచించుకో
ఈ సంవత్సరం, ఈ నెల, ఈ వారం, ఈ రోజు సాధించాల్సిన
లక్ష్యాలను, పూర్తిచేయాల్సిన పథకాలను లిఖితపూర్వకం గా ఏర్పరుచుకో
మనసు బలంగా నమ్మేదేదైనా అట్టే సాధిస్తుందనే సత్యాన్ని తెలుసుకో
అత్యవసరమైనవి, ప్రాముఖ్యత కలిగిన పనులు మాత్రమే
నీవు సాధించాల్సిన కార్యక్రమాలుగా పెట్టుకో
అత్యవసరంకానివి, ఉపయోగం లేనివి నీ దగ్గరకు కూడా రానీయకు
అన్ని పనులు నీకు నీవుగా చేయలేవనే నిజాన్ని అంగీకరించి
నీ వాళ్ళకు పనిచేసే విధానాన్ని నేర్పించి తగినన్ని పనులు బదలాయించుకో
ఉన్న సమయం లో వీలైనన్ని ఎక్కువ పనులు
అత్యధిక ఉపయుక్తంగా చేయగలిగేవాడే ఉత్తమ నాయకుడు
సమయాన్ని నిర్వహించడం చేతకానివాడు
ఏ సంస్థకు కాదు కదా వాడికి వాడుకూడా ఉపయోగపడడు
మనుగడ కోసం పోరాటం అన్న డార్విన్ సిద్ధాంతం
వ్యవస్థలో సార్థకత లేనివాడు కనుమరగవుతాడనని ఏనాడో చెప్పింది కదా
ఆత్మ విశ్వాసం పెంపొందించుకొని
నిరంతరం ఆత్మావలోకనం చేసుకుంటూ
కాలంతో పోరాటం చేస్తూ
నీ ఉనికి చాటుకుంటూ ముందుకు సాగిపో
రాబోయే తరాలకు మార్గదర్శకునిలా మిగిలిపో

0 comments:

Post a Comment